Take a fresh look at your lifestyle.

అరక్షిత బాలికలకు శుభ్రజల సాయం… వాత్సల్య మందిరానికి ప్యూరిఫైయర్ అందజేత

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

 

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం కొల్లాపూర్ చౌరస్తా సమీపంలోని శ్రీ జ్ఞానేశ్వర వాత్సల్య అరక్షిత బాలికల మందిరానికి రూ.35 వేల విలువ గల నీటి ప్యూరిఫైయర్‌ను లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందజేశారు.

ఈ ప్యూరిఫైయర్‌ను 320A లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ మహేంద్ర కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరక్షిత బాలికలకు శుభ్రమైన తాగునీరు అందించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

అదేవిధంగా శ్రీశైలం వెళ్లే శివ భక్తులకు కూడా ఈ నీటి సదుపాయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ సభ్యులు హకీమ్ విశ్వ ప్రసాద్, రాధాకృష్ణ, నరేందర్ రెడ్డి, సురేష్ కుమార్, పరమేశ్వర్ రెడ్డి, ఆశ్రమ మహిళ వార్డెన్ కల్పన, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.