ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూలు:
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో అమ్మాయిలను వేధిస్తున్న ముగ్గురు పోకిరీలను షి టీమ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అమ్మాయిలపై ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్న వారిని గుర్తించిన షి టీమ్ సిబ్బంది వెంటనే చర్యలు తీసుకుని ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా షి టీమ్ ఎస్ఐ రజిత మాట్లాడుతూ, ఆడపిల్లలను వేధించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళల పట్ల ఏ విధమైన వేధింపులు జరిగినా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 లేదా షి టీమ్ హెల్ప్‌లైన్ నంబర్ 8712657676కు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో షి టీమ్ ఎస్ఐ రజితతో పాటు ఏఎస్ఐ రాజ్యలక్ష్మి, కానిస్టేబుల్ వెంకటేష్ పాల్గొన్నారు.