Take a fresh look at your lifestyle.

రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహణ ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

ప్రజాపాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా రోడ్లు & భవనాల (R&B) శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర హాజరై ప్రజలకు రోడ్డు భద్రతపై కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా R&B శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE), డిప్యూటీ ఇంజనీర్ (DE) మరియు సిబ్బంది పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అలాగే RTO సబ్‌ఇన్‌స్పెక్టర్ ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరించారు.

“Arrive Alive” అనే సందేశంతో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని పిలుపునిచ్చారు. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, ముఖ్యంగా హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ ప్రమాదాలకు ప్రధాన కారణమని హెచ్చరించారు.

రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ప్రమాదాలను నివారించడంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఎంతో ముఖ్యమని సూచించారు.

సురక్షిత ప్రయాణం – మన అందరి బాధ్యత
నియమాలు పాటిద్దాం… ప్రాణాలు కాపాడుకుందాం

Leave A Reply

Your email address will not be published.