Take a fresh look at your lifestyle.

తెలంగాణ ఉద్యమంలో నువ్వెక్కడా..?

  • గద్దర్ ఉన్నారా..నువ్వున్నావా..?
  • ఊరూరా తిరిగి జన చైతన్యం తెప్పించిన వ్యక్తి గద్దర్​
  • గంగా ప్రక్షాళనకు సంబరపడ్డ మీకు మూసీపై కోపమెందుకు..?
  • కేంద్రమంత్రి బండి సంజయ్​ ఆరోపణలు అర్ధరాహిత్యం
  • కేటీఆర్​, హరీశ్​ నా కాలి గూటికి సరిపోరని వ్యాఖ్య
  • ధరణి పేరిట భూ అక్రమాలకు పాల్పడి రూ.2 లక్షల కోట్ల ఆస్తులు సంపాదించారని మండిపాటు
  • మంత్రులతో ముఖాముఖి లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో :ప్రజాయుద్ధ నౌక గద్దర్​ కు పద్మ శ్రీ అవార్డు విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్​ చేసిన  వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఊరూరా తిరిగి పాట పాడి అన్ని వర్గాలనూ చైతనపర్చిన గొప్ప కళాకారుడు గద్దర్ అన్నారు.ప్రజల కోసం గజ్జె కట్టి పాట పాడి.ఉద్యమం చేసిన వ్యక్తి గద్దర్​ అన్నారు. ఆయన చనిపోతే ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ కూడా నివాళి అర్పించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.అసలు తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నారా.. బండి సంజయ్ ఉన్నాడా? అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. బుధవారం గాంధీభవన్​ లో జరిగిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీలో గంగా ప్రక్షాళనపై సంబరపడుతున్న బీజేపీ నేతలు రాష్ట్రంలో మూసీ ప్రక్షాళనకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తాము మూసీ నదిని క్లీన్ చేస్తామంటే కిషన్ రెడ్డి,బండి సంజయ్ లు ఏసీ రూమ్స్ లో పడుకుంటున్నారని మండిపడ్డారు.

బుధవారం గాంధీభవన్​ లో జరిగిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బాధితులు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్​ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఇద్దరూ తన కాలి గోటికి కూడా సరిపోరు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.కేటీఆర్ తన తండ్రి పేరు చెప్పి..హరీష్ మామ పేరు చెప్పి రాజకీయాల్లోకి వచ్చారని ఎద్దేవా చేశారు. కానీ తాను కష్టపడి వచ్చి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగానని చెప్పారు.బుధవారం గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.కేటీఆర్ పేరు ఈ ఫార్ములా కేసులో ఉందన్నారు.బీఆర్ఎస్ కీలక నేతలు ధరణి పేరిట భూ అక్రమాలకు పాల్పడి రూ.2 లక్షల కోట్ల ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. అయితే తన వద్ద అక్రమంగా సంపాదించిన రూ. లక్షల కోట్లు లేవన్న ఆయన ఉన్న ప్రజల అండదండలు చాలన్నారు. అమెరికాలో చదువుకున్న కేటీఆర్​ ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను తిట్టడం మొదలుపెడితే బీఆర్​ఎస్​ నేతల తలకాయలు పగిలి పోతాయన్నారు.

ప్రతిపక్ష నేత కేసీఆర్​ కంటే జైలు కు వెళ్లిన మాజీ సీఎం లాలు ప్రసాద్ నయమన్నారు. కేసిఆర్ జైలు కి పోకుండానే ఒక్క సారి అసెంబ్లీ కి రాలేదని సెటైర్లు వేశారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో తనపై ఒక్క అవినీతీ ఆరోపణ లేదనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. కేటీఆర్,హరీశ్​ రావు ఇద్దరు కలిసి..వచ్చే అసెంబ్లీకి కేసీఆర్ ను తమ వెంట తీసుకుని రావాలని సూచించారు. పదేళ్లు అధికారంలో ఉండి అభివృద్ధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ను పడావు పెట్టిన కేటీఆర్ మళ్లీ ఏం మోహం పెటుకుని నల్గొండకు వచ్చాడంటూ మంత్రి ఫైర్ అయ్యారు.బీఆర్ఎస్ రైతు మహా ధర్నాపై స్పందించిన ఆయన తమ కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో పల్లీలు,ఐస్‌క్రీమ్‌లు అమ్ముకునే అంత జనం కూడా కేటీఆర్ రైతు మహా ధర్నా కు రాలేదని సెటైర్లు వేశారు. నల్గొండ, భువనగిరి ఉమ్మడి జిల్లాలో తాను ఎక్కడ నిలబడినా గంటలో 5 వేల మంది గుమిగూడుతారని చెప్పారు.జిల్లాలో ఫ్లోరైడ్ మహమ్మారిని పెంచి పోషించిందే బీఆర్ఎస్ పార్టీ అని దుయ్యబట్టారు.పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ నల్గొండ జిల్లా అభివృద్ధిని విస్మరించిందన్నారు. అసంపూర్తిగా ఉన్న ఎస్​ఎల్​బీసీ ప్రాజెక్టును పూర్తి చేయకుండా అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించిందన్నారు. నల్గొండ లో ధర్నాలో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిన కేటీఆర్.. ముందు మల్లన్ సాగర్ నుంచి ఆలేరుకు ఎందుకు నీళ్ళు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో ఎప్పుడైనా మహాత్మా గాంధీ యూనివర్సిటీకి వెళ్లారా..? అని కేటీఆర్ ను నిలదీశారు. టీ హబ్ కి తాళం వేసిన కేటీఆర్​.. రాష్ట్రానికి కంపెనీలు ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు.

మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల వివరాలు

ఆర్థిక సహాయం :34
ప్రైవేట్ జాబ్స్ : 29
టీఎస్పీ ఎస్సీ పోస్టింగ్ రిక్వెస్ట్ : 3
రెవిన్యూ :105
రోడ్లు :26
చిట్ ఫండ్స్ : 253 (1)
వికలాంగులు :19
ఇందిరమ్మ ఇండ్లు : 173
రేషన్ కార్డులు :119
గ్యాస్ సబ్సిడీ :6
పోలీస్ కేసులు సమస్యలు :13
==========================
    మొత్తం దరఖాస్తులు : 799
==========================

Leave A Reply

Your email address will not be published.