Take a fresh look at your lifestyle.

పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

  • తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు పిట్టల అశోక్ ముదిరాజ్

బోడుప్పల్, ముద్ర విలేకరి: ఆగస్టు 8న పండుగ సాయన్న జయంతిని పురస్కరించుకొని ముదిరాజ్ సంఘం బీబీనగర్ మండలశాఖ ఆధ్వర్యంలో సోమవారం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ భువనగిరి జిల్లాశాఖ అధ్యక్షుడు పిట్టల  అశోక్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన కు వ్యతిరేకంగా పోరాటం సాధించిన బహుజన వీరుడు పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. పండుగ సాయన్న  కేవలం భౌతిక దోపిడీకి వ్యతిరేకంగా మాత్రమే కాదు, సామాజిక న్యాయం కోసం, రాజ్యాధికారంలో బీసీలకు న్యాయమైన వాటా కోసం  పోరాటం సాగించారని ఆయన అన్నారు. సాయన్న వారసత్వాన్ని కేవలం జయంతి నాడు గౌరవించడంలో కాదు — ఆయన కలల తెలంగాణ లో నిజం చేసే దిశగా బీసీలు, బహుజనులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని ఆయన అన్నారు. బీసీలు తమ సామాజిక, రాజకీయ, ఆర్థిక హక్కుల కోసం సంఘటితమవాలని, రాజకీయ తలంపులకోసం కాకుండా, సామాజిక న్యాయ సాధన కోసం పండుగ సాయన్న జయంతిని ఆగస్ట్ 08 వ తేదీన గ్రామ గ్రామాన ఘనంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కనకపోయిన గోపాల్ ముదిరాజ్, కొర్ని పాండు ముదిరాజ్, ఆరుముల్లా జహంగీర్ ముదిరాజ్, బోయిన కృష్ణ ముదిరాజ్, సార నరసింహ ముదిరాజ్, గుండెగాల్ల అశోక్ ముదిరాజ్,, ఎర్రోళ్ల బాలరాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.