.
ముద్ర. పరకాల.
పరకాల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నాలుగో వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పుల్ల స్వరూపకు మద్దతుగా ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నాలుగో వార్డు ఇంచార్జి, జిల్లా కోశాధికారి ఎర్ర రామన్నతో పాటు ఆ డివిజన్‌కు చెందిన బూత్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందని పేర్కొంటూ, అభివృద్ధి కొనసాగాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పుల్ల స్వరూపను గెలిపించాలని ఓటర్లను కోరారు.ఈ ప్రచారంలో పుల్ల రాజు, సాంబయ్య, ఈశ్వర్, అభిరామ్, లత, దీప, సుజాతతో పాటు వార్డు ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలిపారు.
