ముద్ర ప్రతినిధి, మెదక్:
చరిత్రకు ఆనవాళ్లు, మెదక్ పర్యాటక ప్రాంతాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.
భావితరాలకు మెదక్ చారిత్రాత్మక పర్యాటకం గురించి తెలిసేలా డాక్యుమెంటరీ తయారీ చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

బుధవారం 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక పర్యాటక వారోత్సవాల సందర్భంగా హెరిటేజ్ వాక్ నిర్వహించారు. అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్, మెదక్ ఆర్డీవో రమాదేవి, మత్స్యశాఖ అధికారి మల్లేశం యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి,
డిపిఓ యాదయ్య, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు, యువకులు, క్రీడాకారులు, మున్సిపల్ సిబ్బంది వాక్ లో పాల్గొన్నారు. వెస్లీ గోల్ బంగ్లా, మెదక్ చర్చి, అనంతరం మెదక్ ఖిల్లా, బారాకమాన్ సందర్శించి చరిత్రను తెలుసుకున్నారు.
మెదక్ ఖిల్లా చారిత్రాత్మక పర్యాటక ప్రాంతంగా పర్యాటకులను ఆకర్షిస్తుందన్నారు. ఈనెల 22న హెరిటేజ్ ప్రాంతాలను హైలెట్ చేయడంలో భాగంగా మరమ్మత్తులు నిర్వహించి శానిటేషన్ డ్రైవ్, లైటింగ్ ఏర్పాటుచేసి యువకులు, పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.