- ధ్వజమెత్తిన కేటీఆర్.
ముద్ర,తెలంగాణ బ్యూరో: బీఆర్‌ఎస్ మీద నిందలు, బిల్డర్లు కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు.. ఇదే రేవంత్ కు తెలిసిన పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇంతకు మించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని ఏమీలేని మండిపడ్డారు.మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లలో ఒక దగ్గర పగుళ్లు వస్తే దాన్ని పట్టుకొని దున్నపోతు ఈ నిందని కాంగ్రెస్ వాళ్లు అంటే దాన్ని పట్టుకొని దుడ్డెని కట్టేయమని బీజేపీ వాళ్లు అంటున్నారని విమర్శించారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీశ్ రావు ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీని కట్టిన సంస్థ పనికిరానిదైతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అదే సంస్థతో ఎందుకు కట్టిస్తున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యాలయాన్ని కూడా తెలంగాణ నుంచి పోయిన మూటలతో కట్టారని అందరికీ తెలుసన్నారు. వాస్తవాలు తెలియజెప్పడానికి కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై నీళ్లిచ్చిన కేసీఆర్ మీద, నీళ్లిచ్చి కన్నీళ్లు తుడిచిన కేసీఆర్ ప్రభుత్వంపైన అభాండాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. కమిషన్ పేరుతో నాటకాలు ఆడుతున్న విషయంలో వాస్తవాలను బట్టబయలు చేయడానికే హరీశ్ రావును తానే కోరానని అన్నారు.ఈ పరంపరలో ఇది మొదటి మీటింగ్. డాలస్, లండన్‌లో చాలామంది ఎన్‌ఆర్‌ఐలు తమకు కూడా వివరాలు చెప్పాలన్నారు.మేము కూడా సోషల్ మీడియాలో చెప్తామన్నారు.ఈ విషయంలో ఒకడేమో బట్టకాల్చి మీదేస్తుంటే మరొకడేమో తానా అంటే తందానా అంటున్నడు.కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు కలిసి తెలంగాణ బొండిగ పిసికే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.దీనిపై ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలను వివరిస్తామన్నారు.జిల్లాల్లో కూడా ఇలాంటి మీటింగ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.ఇది మొదటి ప్రయత్నం కాదన్నారు. ఇప్పటికే మేడిగడ్డం పోయాం దానిని వెంటనే రిపేర్ చేయాలని కోరామన్నారు. నీళ్లిచ్చే అవకాశం ఉన్నా ఇవ్వడం లేదని ఎన్‌డీఎస్‌ఏ యాక్ట్ కూడా చూపెట్టామన్నారు. ఓనరే రిపేర్ చేయాలని అందులో ఉందన్నారు. ప్రభుత్వం దానిని ఇప్పటికీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉత్తగా రైతుల పొలాలను రాష్ట్ర ఎండబెడుతున్నదని విమర్శించారు.గోదావరి జలాల విషయంలో ఏపీ అనుమతుల్లేకుండా కడుతున్న ప్రాజెక్టు మీద ముఖ్యమంత్రి మాట్లాడడు, బీజేపీ కేంద్ర మంత్రులు మాట్లాడరన్నారు.కాంగ్రెస్ బీజేపీ వాళ్లు నోరు తెరవరని.. అందుకే గోదావరి, కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర రైతాంగానికి, రైతాంగ ప్రయోజనాలకు ఏనాటికైనా కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ ఉద్యమానికి శీర్షిక నీళ్లు, నిధులు, నియామకాలు. అందుకే పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వం ఈ మూడు రంగాల్లో సంపూర్ణమైన న్యాయం చేసిందన్నారు. నీళ్ల విషయంలో కృష్ణా, గోదావరిలో ప్రతినీటి బొట్టును ఒడిసిపట్టి చుక్క నీటిని వదలకుండా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కాలంతో పోటీపడి కట్టిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని దాదాపు 90 శాతం పూర్తి చేశామన్నారు. సీతారామ ప్రాజెక్టును కూడా 90 శాతం పూర్తిచేశామన్నారు. ఇదంతా రాష్ట్ర రైతుల ప్రయోజనం కోసమేని అన్నారు.రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ సర్కారం నిరంతరం పనిచేసిందన్నారు.బీఆర్ఎస్ హయంలో రైతులు పచ్చగా ఉంటే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందన్నారు.
గుజరాత్‌లో మార్బీ అనే ప్రాంతంలో ఒక పెద్ద బ్రిడ్జి కూలి పోయి 140 మంది చనిపోయినా ఏ ఎన్‌డీఎస్‌ఏ పోదు ఏ ఏజెన్సీ పోదన్నారు. బీహార్‌లో నాలుగు రోజులకి ఒక బ్రిడ్జి కూలిపోతున్నా అడిగే నాథుడు లేడన్నారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి రూ.100 కోట్లు నష్టం జరిగితే ఎన్‌డీఎస్‌ఏ రాదన్నారు. అవినీతి, కమీషన్ల కక్కుర్తితో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కుప్పకూలిపోయి 8 మంది చనిపోయినా.. ప్రమాదం జరిగి 100 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కేంద్రంలో ఉండే ఒక్క మంత్రి ఒక్క మాట కూడా మాట్లాడరు. ఎవరూ బాధ్యత తీసుకునేవారు లేరు. అలాగే వట్టెం పంప్ హౌస్ మునిగిపోతే దాని గురించి మాట్లాడే వాళ్ళు లేరు, పెద్ద వాగు ప్రాజెక్ట్ రెండు సార్లు కొట్టుకు పోయినా అడిగేవాడు లేడని విమర్శించారు.