Take a fresh look at your lifestyle.

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి

వికారాబాద్, ముద్ర విలేకరి : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, పెంచిన గ్యాస్ ధరలతో మధ్యతరగతి ప్రజలతో పాటు పేద ప్రజల నడ్డి విరుస్తున్నదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు మండిపడ్డారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలంటూ వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సంతోష్ రాజు ఆధ్వర్యంలో ఆమె పార్టీ నాయకులతో కలిసి పెంచిన ధరలకు నిరసనగా కార్బన్ జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఎన్టీఆర్ చౌరస్తాలో ఖాళీ సిలిండర్లతో నిరసనను వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల పాలిట శాపం కాకుండా చూసుకోవాలని ఆమె సూచించారు.ప్రజలకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు, ఆయా గ్రామాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.