Take a fresh look at your lifestyle.

వాళ్ళ టార్గెట్ ప్రయాణికులే-సిద్దిపేట పోలీస్ కమిషనర్ రశ్మి పెరుమాల్

 

* ఐదుగురు ముత్తగా ఏర్పడి వరుస దొంగతనాలు
* నిండుతుల్లో ముగ్గురు మహిళలు
9 తులాల బంగారం స్వాదినం

 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

 

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న
ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులను సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీ రష్మీ పెరుమాల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా కు చెందిన ఆవుల నాగమని,ఆవుల లక్ష్మి,కంకణాల మరియమ్మ,యూతం కోటేశ్వరరావు,గంజాబోయిన దినేష్ లు ముఠాగ ఏర్పడి బస్సులు, ఆటో లో ప్రయాణిస్తున్న వారిని టార్గెట్ చేస్తూ బంగారు అబ్బారాణాలను దొంగతనం చేస్తున్నారని తెలిపారు. గతంలో గుంటూరు లో కూడా దొంగతనాలకు పాల్పడ్డారన్నారు. గత నెల 30 వ తేదీన యాదగిరి గుట్ట నుండి బచ్చన్నపేటలోని బస్ స్టాండ్ లో ఉన్న ప్రయాణికుల వద్ద బ్యాగును చూసిన నాగమణి, లక్ష్మి లు బస్సులో ఎక్కి ప్రయాణికులు బ్యాగు నుండి బంగారాన్ని తీసుకొని వారు అద్దెకు మాట్లాడుకున్న ఇన్నోవా వాహనంలో పరరయ్యారన్నారు. తిరిగి చేర్యాల కు వస్తున్నా క్రమం లో వారు అనుమాన స్పదంగా కనిపించడంతో పోలీసులు ఆదుపులోకి తీసుకొని విచారించారు. దొంగతనం విషయం బయటపడడంతో వారి వద్ద నుండి రెండు తులాల బంగారు గొలుసు,ఏడున్నర తులాల బంగారు కాసుల పేరు స్వాదినం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిండుతులను అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా సీపీ రష్మీ పెరుమాల్ మాట్లాడుతూ ప్రస్తుతం బంగారం ధర విపరీతంగా పెరగడంతో బంగారం దొంగతనాలు పెరిగిపోయాయన్నారు. ముఖ్యంగా వృద్దులు, చిన్న పిల్లల వద్ద బంగారం ఉండకుండా చూడాలన్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైన 100 కాల్ చేయాలన్నారు. అవసరం అయితే తమ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు బిగించుకోవాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.