ముద్ర ప్రతినిధి, భువనగిరి :
మహనీయులు కలలు గన్న సమానత్వ సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సమాజంలో సామాజిక న్యాయం, సమాన హక్కులు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని దళిత బహుజన ఐక్య వేదిక జిల్లా చైర్మన్ బట్టు రాంచంద్రయ్య నాగరం అంజయ్య, దొనకొండ రాములు అన్నారు. శనివారం మహనీయుల ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రాం భవనంలో భువనగిరి మండల, పట్టణ దళిత సర్పంచ్ లు ,కౌన్సిలర్ ల ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సన్మానోత్సవం కార్యక్రమం బండారు రవివర్ధన్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 9, 18,19,22,23 వార్డుల కౌన్సిలర్లు బొంతల నరసింహ, పాశం అమర్నాథ్, బండారి స్వర్ణలత, జాలిగం విగ్నేష్, బర్రె పూజిత జహంగీర్, తుక్కపురం గ్రామ సర్పంచ్ జనగాం పాండు, అనంతరం గ్రామ సర్పంచ్ పల్లెపాటి నాగమణి రాజలింగం, చీమల కొండర్ గ్రామ సర్పంచ్ పల్లెర్ల అంజయ్య, బాలంపల్లి గ్రామ సర్పంచ్ కాశపాక సాయి కృష్ణలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బర్రె జహంగీర్, ఇటుకల దేవేందర్ మాదిగ, నాగరం శంకర్, కారుపాటి రాజు, కుతడి సురేష్, దుబ్బ రామకృష్ణ ,కనుకుంట్ల రమేష్ కోటి,ఎర్ర మహేష్ , భాస్కర్ నాయక్ పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.