ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మున్సిపల్ పరిధిలో కుక్కల పట్టివేత కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు భువనగిరి మున్సిపాలిటీ లో అన్ని వార్డులలో కుక్కలు లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కుక్కలు ఎక్కువగా గుంపులు ఉన్నచోటు వాట్సప్ ద్వారా కౌన్సిలర్లకు, మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు.