Take a fresh look at your lifestyle.

చెరువులు, కుంటలను సంరక్షించాలి… మాజీ మంత్రి జీవన్ రెడ్డి… జగిత్యాల-గొల్లపల్లి ప్రధాన రహదారిపై ధర్నా…

 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

జగిత్యాల పరిసర ప్రాంతాల్లోని చెరువులో కుంటలు వాటికి అనుబంధంగా ఉండే కాలువలను కబ్జాదారుల నుంచి సంరక్షించాలని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల-గొల్లపల్లి ప్రధాన రహదారిపై సోమవారం BRS పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ జగిత్యాల పట్టణ శివారులోని తిమ్మాపూర్, రఘురాముల కోట, ముప్పాళ్ళ చెరువు నీటి వనరుల చేరికకు అడ్డుగా ఉన్న ఓర్రెలు, చెరువుల అక్రమణాల మట్టి తొలగింపులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రెవిన్యూ కామ ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా కలిసి కబ్జాదారుల చరణ నుండి చెరువులో కాలువలను కాపాడాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. ఈ ఆందోళనలో మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావసంత సురేష్, ఇతర టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.