Take a fresh look at your lifestyle.

నిరుపేదల ఆత్మగౌరవ పథకం

ముద్ర మొయినాబాద్: సన్న బియ్యం నిరుపేదల ఆత్మగౌరవ పథకం అని. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సర్దార్నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలకృష్ణారెడ్డి పేర్కోన్నారు.మండలం లోని కనకమామిడి గ్రామంలో రేషన్ లబ్దిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గోని లబ్దిదారులకు బియ్యం పంపిణీ చేశారు.అనంతరం మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీష్ఠాత్మకంగా చేపట్టిన చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అప్పట్లో దొడ్డు బియ్యం ఇస్తే వాడుకునే పరిస్థితి ఉండేది..కాదని సన్నబియ్యంతో పేదల ఆకలి తీరుతుందన్నారు.సన్న బియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవ పథకమన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాద్యక్షుడు మర్రి రవిందర్రెడ్డి మాజీ సర్పంచ్లు జనార్దన్రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు ఆలూరి రాములు, డీలర్ అనంతరెడ్డి రేషన్కార్డు లబ్దిదారులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.