Take a fresh look at your lifestyle.

వ్యక్తి నిర్మాణం.. సమాజ హతం కోసం పనిచేయాలి

  • మండల నూతన నూతన భజ్ రంగ్ దళ్ కమిటీ ఎన్నిక.

ముద్ర మొయినాబాద్: వ్యక్తి నిర్మాణం,సమాజ హితం కోసం పనిచేయాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ పాలమూరు విభాగ్ సంయోజక్ గూడెం రమేష్ పేర్కోన్నారు.విశ్వహిందూ పరిషత్, భజ్ రంగ్ దళ్ అధ్వర్యంలో మెయినాబాద్ మండల భజరంగ్ దళ్ నూతన కమిటీని బుధవారం ఎనుకున్నారు.ఈ కార్యక్రమంలో గూడెం రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ వ్యక్తి నిర్మాణం..సమాజ హితం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం పనిచేయాలని సూచించారు. హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులను ఆరికట్టాలని అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పారు.ప్రతి ఒక్కరూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం పనిచేయాలని సూచించారు. దేశ రక్షణలో ప్రతి ఒక్కరూ బాగస్వాములవ్వాలని సూచించారు. భజరంగ్ దళ్ మండల సంయోజక్(అద్యక్షుని)గా విజయ్ పాండు, సహా సంయోజాక్ శ్రీధర్, శ్రావణ్, విద్యార్థి ప్రముఖ్ గా సాయికోటి, నితిన్, బిందు కిరణ్, సురక్ష ప్రముఖ్ శివకుమార్, బలోపాసన ప్రముఖ్ శివయాదవ్, సాప్తాహిక్ మిలన్ ప్రముఖ్ భరత్ యాదవ్, గోరక్ష ప్రముఖ్ నరేందర్ రెడ్డి, శ్రీనివాస్లను మండల నూతన కమిటీలో ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో భజ్ రంగ్ దళ్ అనంతగిరి జిల్లా సహా ప్రముఖ్ రమేష్ చారి, విశ్వహిందూ పరిషత్ గో సురక్ష ప్రముఖ్ కాసుల సురేష్ గౌడ్, మండల పూర్వపు భజ్ రంగ్ దళ్ కార్యకర్తలు పాలోన్నారు.

Leave A Reply

Your email address will not be published.