Take a fresh look at your lifestyle.

అడుగడుగునా నిఘా.. కట్టుదిట్టంగా వాహన తనిఖీలు సైబారాబాద్ పోలీసు విస్తృత తనిఖీలు

 

ముద్ర, శేరిలింగంపల్లి:

అనుమానాస్పద కదలికలపై నిఘా పెంచే లక్ష్యంతో సైబరాబాద్ పోలీసులు క్షేత్రస్థాయిలో విజిబుల్ పోలీసింగ్‌ను విస్తృతంగా అమలు చేస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్ పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కేపీహెచ్‌బీ, బాచుపల్లి, బాలానగర్, నార్సింగి, కూకట్‌పల్లి సహా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ అప్రమత్తంగా గస్తీ కాస్తున్నారు. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెక్సస్ మాల్ వద్ద ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. అలాగే బాచుపల్లి ఇన్ స్పెక్టర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హిల్ కౌంటీ ప్రాంతంలో విస్తృతంగా వాహనాల చెకింగ్ చేపట్టారు. బాలానగర్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ నరసింహ రాజు సిబ్బందితో కలిసి నార్సాపూర్ క్రాస్ రోడ్స్ వద్ద ప్రత్యేక విజిబుల్ పోలీసింగ్ నిర్వహించి అనుమానాస్పద కదలికలపై నిఘా పెట్టారు. వాహనాల పత్రాలు పరిశీలిస్తూ ప్రజల భద్రతకు భంగం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.