ముద్ర, భువనగిరి ప్రతినిధి :
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లడుతూ ఆసుపత్రిలోని ఎన్ని విభాగాలు ఉన్నాయని, ఎంత మంది డాక్టర్ లు ఉన్నారని, ఎంత మంది సిబ్బంది ఉన్నారని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సగటున ఎంతమంది ఇన్ పేషెంట్ గా అడ్మిట్ అవుతున్నారని తెలుసు కున్నారు. ఆసుపత్రిలో ఉన్న వార్డు లను కలియ తిరిగారు. ఇన్ పేషెంట్ తో కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారా, మంచి ఆహారం పెడుతున్నారా అని ఆరా తీశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. అవసరమైన ఔషధాలు అన్ని అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. గడువు ముగిసిన మందులను చెక్ చేయాలన్నారు. పేషెంట్లకు మందులు ఇచ్చే ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలి అన్నారు. పేషంట్లకి అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు వివిధ రకాల టెస్టులను ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయాలన్నారు. గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని, సమయ పాలన పాటించాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు హెల్త్ ప్రొఫైల్ చెక్ చేయాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వైద్యులు, సిబ్బంది అందరూ అంకితభావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జీ జీ.హెచ్ లో నిర్మాణంలో అదనపు గదుల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేయాలి అన్నారు. అవసరమైన ఫర్నిచర్ కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపర్డెంట్ పాండు నాయక్, డాక్టర్స్ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Swapna is a Web Admin and She is working with our organisation and She has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.