Take a fresh look at your lifestyle.

అభివృద్ధి పనులు త్వరతగతిన పూర్తి చేయండి – జిల్లా కలెక్టర్ హైమావతి

 

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :

అభివృద్ధి పనులు త్వరతగతిన పూర్తి చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. బుధవారం
సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్ జిల్లాలోని ఏంజీ ఎన్ఆర్ఈజీఎస్ కింద నిర్మాణంలో ఉన్న పనుల ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనుల గూర్చి ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ . జిల్లాలో ఆయా గ్రామంలో ఏంజీ ఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టిన పనులు అంగన్వాడి భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, సబ్ సెంటర్, గ్రామ మహిళా సమాఖ్య, పుడ్ గ్రైన్ స్టోరేజ్, సిసి రోడ్లు, ఆయా పాఠశాలలో ప్రహరీ గోడ, మరుగుదొడ్లు నిర్మాణాల పైన సమీక్షించారు. అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు, ప్రహరీ గోడ నిర్మాణాలకు మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పనులు పూర్తి చెయ్యాలని ఆదేశించారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన ఈజీఎస్ పనులు పూర్తి చేసి ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ 15 రోజులు అత్యంత కీలకం అని ఆయా నిర్మాణాలు ఒక ప్రణాళిక ప్రకారం రోజు వారిగా ప్రోగ్రెస్ తీసుకురావాలని ఆయా స్థాయిలో నిర్మాణం పూర్తి కాగానే మాస్టర్ జెనరేట్ చేసుకుని అప్లోడ్ చెయ్యాలని తెలిపారు.
ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గం, మండలం, గ్రామం వారిగా ప్రారంభాలకు సిద్ధం చెయ్యాలని పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, పంచాయతీరాజ్ ఈఈ చిరంజీవి, ఏఈ లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.