అచ్చంపేట, ముద్ర: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం చారగుండ మండలం శ్రీరామనవమి సందర్భంగా సిరసనగండ్ల శ్రీ రామచంద్ర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ కల్యాణోత్సవానికి స్వామివారికి రాష్ట్రప్రభుత్వం తరఫున మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి,ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి లు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.సీతారాముల కల్యాణ వేడుకను తిలకించేందుకు ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు.దీంతో ఆలయ ప్రాంగణమంతా రామ నామస్మరణతో మార్మోగుతోంది.ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామచంద్రస్వామి శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. వేదపండితులు శాస్త్రోక్తంగా రాములోరి కల్యాణ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మధ్యాహ్నం 12.30 గంటల శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం నిర్వహించారు స్వామి వారి కల్యాణోత్సవం వీక్షించేందుకు వేలాది మంది భక్తులు సిర్సనగండ్ల కు తరలివచ్చారు.సీతారామచంద్రస్వామి కళ్యాణం చేసిన భక్తులు భక్తి పార్వశంతో పరవశించిపోయారు అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి ఇలాంటి విజ్ఞానం జరగకుండా మా కుటుంబాలను కాపాడవలసిందిగా రామచంద్ర ప్రభువును భక్తులు వేడుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు,ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యేగువ్వల బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.
