Take a fresh look at your lifestyle.

మూసీ సుందరీకరణ భూ సేకరణ ప్రక్రియ వేగవంతం – ఆర్టీవో వెంకటరెడ్డి

 

– రాజేంద్రనగర్ ఆర్డిఓ పరిధిలో భూసేకరణకు నోటిఫికేషన్

ముద్ర ప్రతినిధి, బండ్లగూడ:
రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేశామని ఆర్డిఓ వెంకట్ రెడ్డి తెలిపారు . ఈ అంశంపై రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్ రెడ్డి మంగళవారం ఆయన కార్యాలయంలో కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మూసీ నది పునరుద్ధరణ మరియు సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలో భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది అన్నారు. ఈ మేరకు కిస్మత్‌పురా, దర్గా ప్రాంతాల్లో రెండు కీలక నోటిఫికేషన్లు జారీ చేసినట్లు రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్ రెడ్డి వెల్లడించారు. మొత్తం 83 ఎకరాల 13 గుంటల భూమిని ఈ ప్రాజెక్టు కోసం సేకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.బండ్లగూడ జాగీర్, ఉప్పర్‌పల్లి ప్రాంతాల్లో కూడా అవసరమైన నిర్మాణాలను స్వాధీనం చేసుకుంటున్నామని, మూసీ ప్రాజెక్టు సజావుగా సాగేందుకు ప్రజలు సహకరించాలని ఆర్డీవో కోరారు.పారదర్శకంగా సేకరణ ప్రక్రియ
భూసేకరణలో భాగంగా బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శక విధానాన్ని అవలంబిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అంచలంచలుగా భూ సేకరణ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ప్రాథమిక నోటిఫికేషన్ ప్రస్తుతం ఇస్తున్నామని తరువాత 60 రోజుల్లోపు స్థానికుల అభిప్రాయాలను, అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు . మొదలు మూసి బఫర్ జోన్ అయినా 50 మీటర్లు వరకు స్థలాన్ని సేకరిస్తున్నామని చెప్పారు.నది గట్టు నుండి 500 మీటర్ల పరిధిలో ఎలాంటి కొత్త నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని ఆర్డీవో స్పష్టం చేశారు. ప్రస్తుతానికి హిమయత్ సాగర్ కట్టకింద, ఖలీజ్ ఖాన్ దర్గా, కిస్మత్పూర్ ప్రాంతాల్లో 44.08 ఎకరాలు, ఉప్పర్ పల్లి పరిధిలోని 31.09 ఎకరాల భూములకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు…..
మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ నివాసితులు మంగళవారం రోజు ఆర్టీవోలు కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. బండ్లగూడ జాగిర్ పరిధిలోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగిందని అపార్ట్మెంట్ ను కచ్చితంగా స్వాధీనం చేసుకుంటామన్నారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ ప్రస్తుతం ఉన్న 50 మీటర్ల బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందని ఆయన ధృవీకరించామన్నారు.
2004లో బఫర్ జోన్ 12 మీటర్లుగా ఉండగా, 2012లో అది 50 మీటర్లకు పెరిగిందన్నారు . మధు పార్క్ అపార్ట్‌మెంట్‌ను గతంలో అన్ని రకాల ప్రభుత్వ అనుమతులతోనే నిర్మించినట్లు ఆయన గుర్తించామన్నారు. ఏది ఏమైనా 2.2 ఎకరాల స్థలంలో ఈ అపార్ట్మెంట్లు బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయని, రాజకీయ నాయకులు మధ్య పెడితే వాస్తవాలు తెలుసుకొని అపార్ట్మెంట్ నివాసులు మాట్లాడాలన్నారు.
ఉన్నఫలంగా నివాసాలను ఖాళీ చేయించకుండా, దశల వారీగా సంప్రదింపులు జరిపి స్వాధీనం చేసుకుంటామని నివాసితులకు ఆయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.