దేవదేవుని ఆశీస్సులు ప్రభుత్వంపై ఉండాలి.. : మంత్రి అడ్లూరి
ఘనంగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథ రథోత్సవాలు..
హాజరైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు..
ముద్ర, ధర్మపురి:
ధర్మపురి లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం రథోత్సవం కార్యక్రమాన్ని ధర్మపురిలో ఘనంగా నిర్వహించారు. రథోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే రథోత్సవ కార్యక్రమం ప్రతి యేటా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దయతో పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ లో తనకు అవకాశం ప్రభుత్వం కల్పించిందని మంత్రి తెలిపారు.
వచ్చే ఏడాది లో నిర్వహించే గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం తరుపున పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, ఆలయ కమిటీ చైర్మన్ జక్కు రవీందర్ తో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.