Take a fresh look at your lifestyle.

పి ఎచ్ సి లలో మెడికల్ క్యాంపు లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి-ప్రభుత్వ హాస్పిటల్ లలో సాధారణ ప్రసవాలు పెరగాలి – కలక్టర్

 

గైనిక్ , బిపి, షుగర్ , కంటి సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించబడును

 

ముద్ర ప్రతినిధి , కోదాడ …. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా 99 రోజుల కార్యాచరణ లో భాగంగా వైద్య నిపుణలచే ప్రతి పి హెచ్ సి లో మెడికల్ క్యాంప్ లు నిర్వహించడం జరుగుతుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు.
దీనిలో భాగంగా మంగళవారం మేళ్లచెరువు పి హెచ్ సి లో జరుగుతున్న మెడికల్ క్యాంప్ ను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మెడికల్ క్యాంపు ల ద్వారా జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్, గైనకాలజీ, ఆర్థోపెడిక్, ఆప్తమాలజీ, మహిళలకు గర్భశాయ ముఖ కాన్సర్ లను గుర్తించే టాప్ స్పెయర్, కంటికి సంబందించి లోపాలు , బి పి , మధుమేహం , చిన్న పిల్లలో ఆరోగ్య సమస్యలతో పాటు పోషకాహార లోపాలకు చెందిన వైద్య నిపుణులు రోజుకొక పి హెచ్ సి కి వచ్చి వైద్యపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందించటం తో పాటు ఆరోగ్యం మెరుగుపడేలా పలురకాల సూచనలు ఇస్తారని , ఇంకా ఏమైనా శస్త్ర చికిత్స లు చేయాల్సివచ్చిన మెరుగైన వైద్యం కోసం జనరల్ హాస్పిటల్ కి రిఫర్ చేయటం జరుగుతుందని అన్నారు. మంగళవారం మేళ్లచెరువు లో నిర్వహించిన మెడికల్ క్యాంప్ లో
300 ఓపి నమోదు అయిందని తెలిపారు. మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్న తీరు పై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పిహెచ్ సి లలో సాధారణ ప్రసవాలు పెరిగేలా ప్రజలను ఆహగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు.

ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సీయల్ స్కూల్ లో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్

మేళ్లచెరువు మండల కేంద్రం లోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూల్ లో కలెక్టర్ హాస్టల్ గదులను పరిశీలించిన అనంతరం వంట గదిని కూడా పరిశీలించి , హాస్టల్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు.
విద్యార్థులను ప్రతి రోజు వంట బాగుంటుందా ? మెను ప్రకారం ప్రతిరోజు ఆహారం ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పదవతరగతి వార్షిక పరీక్షలలో ప్రతి విద్యార్థి ప్రతి సబ్జెక్ట్ లో కనీసం 70 శాతానికి పైగా మార్కులు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకొనిరావాలని కోరారు. కలెక్టర్ వెంట డిప్యుటీ డిఎంహెచ్ఓ మాధవ్ కుమార్ , డాక్టర్ సుధాకర్ నాయక్ , వైద్యులు యశ్వంత్ , మణి , ప్రజ్ఞ , సాయి శ్రీ , వెంకటేష్ , సమీర, మెడికల్ అధికారి , వైస్ ప్రిన్సిపాల్ మధు , ఇన్చార్జి తహశీల్దార్ సురేందర్ రెడ్డి , సర్పంచ్ బచ్చు పద్మావతి , ఉప సర్పంచ్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.