Take a fresh look at your lifestyle.

ఆల్రెడీ బీజేపీ తెలంగాణలో అడుగుపెట్టింది

  • నువ్వు అడుగుపెట్టనిచ్చేంది ఏంటీ?
  • కామారెడ్డిలో నిన్ను ఓడించాం.
  • నీ సొంత జిల్లాలో ఎంపీ సీటును గెలుచుకున్నాం.
  • నీ సిట్టింగ్ సీటు మాల్కాజ్ గిరిలో పాగా వేశం.
  • నువ్వు ఇన్‌చార్జ్‌గా ఉన్న చేవెళ్ళలోనూ గెలిచాం.
  • సీఎం రేవంత్ వ్యాఖ్యలకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు కౌంటర్.

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ఆల్రెడీ బీజేపీ అడుగుపెట్టేసిందని, ఇక రేవంత్ రెడ్డి అడుగు పెట్టనిచ్చేది ఏంటి? అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ధ్వజమెత్తారు.రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సీటు కూడా బీజేపీదేనని అన్నారు.తెలంగాణలో కాంగ్రెస్‌కు రేవంత్ రెడ్డే చివరి ముఖ్యమంత్రి అని విమర్శించారు.”అహ్మదాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు.”తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనీయమని, మిగతా రాష్ట్రాలలోనూ ఆ పార్టీని కట్టడి చేయాలని, ఆనాడు దేశం నుంచి అంగ్లేయులను తరిమికొట్టినట్లుగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుదామని” సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.దీంతో సీఎం రేవంత్ వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ రఘనందన్ రావు కౌంటర్ ఇచ్చారు.సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోని ఎంపీ సీటును బీజేపీ గెలిచిందని గుర్తు చేశారు.రేవంత్ సిట్టింగ్ సీటైన మల్కాజ్ గిరి ఎంపీ స్థానంలోనూ బీజేపీ విజయం సాధించిందన్నారు. రేవంత్ రెడ్డి ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన చేవెళ్ళలోనూ బీజేపీ గెలిచిందన్నారు.మాజీ సీఎం కేసీఆర్ ఇలాకాలోనూ బీజేపీ గెలిచిందని చెప్పారు.కామారెడ్డిలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో పాటు మాజీ సీఎం కేసీఆర్‌ను కూడా బీజేపీయే ఓడించిందని అన్నారు.తెలంగాణలో ఇప్పటికే పాగా వేసిన బీజేపీ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదని ఎంపీ రఘునందన్ చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.