Take a fresh look at your lifestyle.

బ్రాహ్మణపల్లి రోడ్డు పనులు పరిశీలించిన కాంగ్రెస్ నాయకుడు పొట్టోళ్ల

బీబీనగర్, ముద్ర ప్రతినిధి:

బీబీనగర్ మండలం రాఘవాపూర్ గ్రామం నుంచి లక్ష్మిదేవి గూడెం, బ్రాహ్మణపల్లి మీదుగా ఎర్రబెట్టి తండావరకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి సహకారంతో ప్రారంభమైన సిమెంట్ రోడ్డు పనులను ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొట్టోల శ్యామ్ గౌడ్ బీబీనగర్ మండలకాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురకంటి సత్తి రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ రహదారి చుట్టు ప్రక్కల గ్రామాలకు ఎంతో ముఖ్యమైనదని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం నాణ్యత తో పాటు త్వరతగతిన రోడ్డు పనులు పూర్తి చేస్తున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి వారు ధన్యవాదములు తెలిపారు. ముఖ్యంగా రోడ్ కి ఇరువైపులా పొలాలు ఉండడంతో సీసీ రోడ్ కి మంజూరి ఇవ్వటంతో రోడ్ పాడవకుండా చాలా సంవత్సరాలు వరకు నాణ్యతతో ఉంటుంది అని చెప్పారు. ఎన్నో సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న రోడ్ నిర్మాణం ప్రారంభం అవడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే రోడ్డు పూర్తి చేసుకొని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభం చేసుంటాం అని అన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమ్మిడి ఇంద్రా రెడ్డి, గూడూరు మహిపాల్ రెడ్డి, సర్పంచ్ లు సిద్దగోని శ్రీకాంత్ గౌడ్, జిల్కపల్లి భాను సుధాకర్, ఉప సర్పంచ్ లు సిలివేరు కవిత మహేష్, జిల్లాల మహిపాల్ రెడ్డి, కొక్కలగొండ బాలయ్య, మాజీ సర్పంచ్ రక్తని కృష్ణ, మాజీ ఉపసర్పంచ్ అంబటి చంద్రయ్య ,వార్డ్ సభ్యులు తొర్పునూరి రవి గౌడ్ , న్యాలపట్ల అజయ్ గౌడ్,దొడ్డి జ్యోతి మహేష్ ,మేకల కుమార్ , గుర్రం నవీన్ రెడ్డి ,రక్తని మల్లేష్ , ప్రసాద్, రమేష్, జిల్కపల్లి మహేష్ ,మల్లేష్ ,వీరేష్ ,కొక్కలగొండ దయాకర్ ,పురుషోత్తం , ఆంజనేయులు ,రవితేజ తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.