Take a fresh look at your lifestyle.

పలు వివాహాలకు హాజరై దంపతులను ఆశీర్వదించిన ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

వికారాబాద్, ముద్ర విలేకరి : వికారాబాద్ జిల్లా పరిధిలోని తాండూరులో పలు వివాహాలకు శుక్రవారం ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కోకట్ రోడ్డు లోని ఎన్ ఎం ఫంక్షన్ హాల్ లో అగ్గనూరు గ్రామానికి చెందిన మంగలి జయమ్మ- గోపాల్ దంపతుల కుమారుడు అశోక్ – అనూష ల వివాహానికి హాజరై అక్షింతలు వేసి ఆశీర్వదించారు. తులసి గార్డెన్ లో బంటు నర్సింలు – అనంతమ్మ దంపతుల కుమారుడు వెంకటేష్ – సుస్మితల వివాహానికి హాజరై అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గడ్డలు రవీందర్, మాజీ సర్పంచ్ కేశవరావు, బిర్కెట్ రఘు, సంకేత్, అయూబ్, శివానంద్, ఆనంద్ గౌడ్, మెట్లు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.