- జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.
- జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
కోరుట్ల, ముద్ర విలేకరి: ఛత్తీస్‌గఢ్ కంకేర్ జిల్లా బస్తార్ డివిజన్ ఏరియా కమిటీ మావోయిస్టు కార్యదర్శి గాంబల్ అలియాస్ మమత అలియాస్ వసంతక్క కంకేర్ జిల్లా ఎస్పీ కళ్యాణ్ సమక్షంలో గత కొద్ది రోజుల క్రితం అక్కడి ప్రభుత్వ ప్రకటన మేరకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి, ఈ మధ్యనే సొంత గ్రామమైన కోరుట్లకు రాగా ఈ విషయాన్ని తన అక్క కుమారుడు పనుల కృష్ణ ప్రసాద్ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జువ్వాడి నర్సింగ్ రావు ను ఆశ్రయించగా మంగళవారం రోజు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ల వద్దకు వసంతను తీసుకెళ్లి తన లొంగుబాటు గురించి వివరించారు. వసంత జీవనోపాధి, తన కుమార్తె కు తగు ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇండ్లలో అవకాశం గురించి చర్చించగా, వసంత కు జీవనోపాధి, తన కుమార్తె కు తగు ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇండ్లలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నం అనీల్, బలిజ రాజరెడ్డి, పసుల కృష్ణ ప్రసాద్, పేట భాస్కర్, జిందం లక్ష్మీ నారాయణ, జెట్టి లక్ష్మణ్, దర్శనాల రాజు, వసంత, కుటుంబ సభ్యులు వుయ్యాల నర్సయ్య, శోభన్, పసుల హారీష్ పాల్గొన్నారు.