గతంలోనూ నిందితుడిపై నేరచరిత్ర జైలుకు వెళ్లిన వైనం
ప్రత్యేకంగా కృషిచేసిన పోలీసులకు ఎస్పీ అభినందన
మీడియాకు వివరాలు వెల్లడించిన ఎస్పీ వినీత్ కుమార్
కేసును చేదించడంలో విశేషంగా కృషిచేసిన మహిళా ఎస్సై గాయత్రి
ముద్ర , నారాయణపేట:
అభం శుభం తెలియని చిన్నారిపై మద్యం మత్తులో అత్యాచారయత్నం చేసి ఆపైగా హత్య చేసిన ఘటనను నారాయణపేట పోలీసులు తక్కువ సమయంలోనే చేదించారు. నారాయణపేట మండలం అమ్మి రెడ్డి పల్లి గ్రామంలో ఐదేళ్ల వయస్సు గల చిన్నారిని అదే గ్రామానికి చెందిన బక్క చిన్న నరసింహులు మార్చి 31న అత్యాచారయత్నం చేసి ఆపైగా హత్య చేసి గ్రామ సమీపంలోని చెరువు వద్ద వదిలి వెళ్ళినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించగా గ్రామానికి చెందిన బక్క చిన్న నరసింహులు అత్యాచారం హత్య చేసినట్లు నేరం రుజువైందన్నారు…నిందితుడు 2014 లో కూడా అత్యాచార యత్నం ఘటనలో కేసు నమోదు రిమాండ్ కు వెళ్లినట్లు చెప్పారు. కేసును చేదించడంలో కృషిచేసిన పోలీస్ అధికారులను ఎస్పీ స్వయంగా అభినందించారు. ఇదిలా ఉండగా ఈ ఘటనకు సంబంధించి మొదట గ్రామంలో నీ ప్రజలు పోలీసులకు సహకరించలేదు. పోలీసులు తమదైన శైలిలో బృందాలుగా ఏర్పడి అనుమానితులను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా నేరం చేసిన వ్యక్తి పేరు బయటపడింది. అదేవిధంగా ఈ ఘటన సమయంలో నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ మహిళా ఎస్సైగా పనిచేసిన గాయత్రి కేసును చేదించడంలో విశేషంగా కృషిచేసిందని చెప్పవచ్చు.