ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
పదిహేనేళ్ల తర్వాత పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చింది ప్రజా ప్రభుత్వం అని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం
భువనగిరి మండలంలోని బండ సోమరం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పట్టు వస్త్రాలను అందజేశారు. ఈ సందర్బంగా గృహ ప్రవేశం చేసిన లబ్ధిదారులు మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా ఇండ్లు లేక అవస్థలు పడుతున్న మాకు రేవంత్ రెడ్డి సర్కారు మా సొంతింటి కలను నెరవేర్చిందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ నానం కృష్ణ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.