Take a fresh look at your lifestyle.

అతివలందరికీ సరిత ఆదర్శం

  • ఆర్టీసీలో తొలి డ్రైవర్‌గా చేరి మహిళా శక్తిని చాటుకున్నారు.
  • సీఎం రేవంత్ రెడ్డి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌గా చేరిన వాంకుడోతు సరిత.. అతివలందరికీ ఆదర్శంగా నిలిచారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. అవకాశాలు వస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపించారని వ్యాఖ్యానించారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన సరిత కు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులకు మహిళలనే యజమానులుగా చేస్తున్న సందర్భంలో, మహిళా డ్రైవర్ నియామకం ఒక కీలక ముందడుగు అని పేర్కొన్నారు.మహిళలు విద్య, విజ్ఞానం, వృత్తి, వ్యాపారం, క్రీడలు, సైన్యం వంటి అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని చెప్పారు.గృహ బాధ్యతలు, సమాజ నిర్మాణంలోనూ మహిళల పాత్ర అపూర్వమని చెప్పారు.ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ, అడ్డంకులను అధిగమించి మహిళలు విజయాల బాటలో ముందుకెళ్తున్నారన్నారు. అలాంటి వారందరికీ సరిత ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు. కాగా తొలిరోజు విధుల్లో భాగంగా సరిత హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్సు నడిపారు. ఈ నేపథ్యంలో సరిత పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. తాజాగా ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌గా చేరిన వాంకుడోతు సరితకు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా అభినందించారు. అవకాశాలు వస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని, ఆత్మవిశ్వాసంతో ముందుడుగు వేసిన సరితకు ఆయన అభినందనలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.