Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో దోపిడి ముఠా తిరుగుతోంది

  • ఇది రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో పనిచేస్తోంది
  • యధేశ్చగా డబ్బులు వసూలు చేస్తోంది
  • కబ్దాలు…..భూదందాలకు కొదవలేదు
  •  వీటిని పక్కదారి పట్టించడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అంశాలను తెరపైకి తీసుకొస్తోంది
  • రేవంత్ సరర్కార్ పై మరోసారి విరుచుకుపడ్డ కేటీఆర్

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :-రాష్ట్రంలో దోపిడి ముఠా తిరుగుతోందని….దీనికి మార్గ దర్శకత్వం వహిస్తున్నది సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ ముఠా….ప్రస్తుతం రాష్ట్రంలో యధేశ్చగా దోపిడి చేస్తోందని ఆరోపించారు. ఈ ముఠా రాష్ట్రంలోని కంపెనీలను బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూళ్లకు తెగబడుతోందని మండిపడ్డారు. వీరి కబ్జాలు,  భూ దందాలకు అంతులేకుండా పోతోందన్నారు.  వీటిని పక్కదారి పట్టించడం కోసమే అనేక అంశాలను కాంగ్రెస్ అనవసరంగా తెరమీదకి తీసుకువస్తుందని విమర్శించారు. 

శుక్రవారం షాబాద్ లో నిర్వహించిన రైతు ధర్నా అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలనను గాలికి వదిలిపెట్టి రేవంత్, ఆయన సోదరులు రాక్షసుల్లా  దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. అడ్డు, అదుపు లేకుండా వారి దోపిడి సాగుతోందని మండిపడ్డారు.  కొన్ని రోజులు కాళేశ్వరం, మరి కొన్ని రోజులు ఫోన్ టాపింగ్.. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం టైం పాస్ చేస్తుందన్నారు. తాము గతంలో చేసిన పెట్టుబడి ప్రయత్నం ఫలితంగానే ఈరోజు పరిశ్రమలు ఏర్పాటయ్యాయన్నారు.. ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయన్నారు. కానీ రూ. 40 వేల కోట్ల  ప్రకటనలు చేసిన రేవంత్ రెడ్డి.. పెట్టుబడులు ఏవి కూడా తెలంగాణకు రాలేదన్నారు. మోసాలనే ఎజెండాగా చేసుకుని రేవంత్ ఎదుగుతున్నారని విమర్శించారు. గతంలో ఏబీవీపీలోనూ,  ఆర్ఎస్ఎస్ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసిన రేవంత్ రెడ్డి…..ఆయన వేసుకున్న నిక్కర్ కూడా ఖాకీ నిక్కర్ అని గతంలో అసదుద్దీన్ ఒవైసీ అన్నారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తికి  ప్రస్తుతం వేల కోట్లకు ఎలా ఎదిగారని ప్రశ్నించారు.

ఆ ఎన్నికల తరువాత రైతు భరోసా ఉండదు

రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల త‌ర్వాత రైతు భ‌రోసాను కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎత్తేయ‌డం ఖాయ‌మ‌ని  కేటీఆర్ అన్నారు.  ఈ ఎన్నిక‌ల కోస‌మే రైతు భ‌రోసాను రేవంత్ రెడ్డి తెర‌పైకి తీసుకువ‌స్తున్నాడ‌ని మండిపడ్డారు. రైతులకు వ్యతిరేకంగా రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము చూస్తూ సహించబోమని హెచ్చరించారు.  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇయ్యకుండా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రేవంత్ కుట్ర పన్నారని మండిపడ్డారు. 

రైతుల కోసమే పోరుబాట

రైతుల కోసమే బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టిందన్నారు. అందులో భాగంగానే ఇక్కడ మొదటి రైతు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అలాగే 21వ తేదీన నల్లగొండలో రైతు ధర్నా ఉంటుందన్నారు.  కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు 22 లక్షల మంది గురించి మాట్లాడడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మాట ప్రతి హామీని నిలబెట్టుకోవాలని… అప్పటిదాకా కాంగ్రెస్‌ను వదిలిపెట్టమన్నారు. రైతులకు, వ్యవసాయానికి కేసీఆర్ చేసినంత సేవ దేశ చరిత్రలో ఎవరూ చేయలేదన్నారు.. రైతుబంధు, రైతు బీమా, రైతు వేదికలు, సాగునీరు వంటి అనేక విప్లవాత్మక కార్యక్రమాలను కేసీఆర్ తీసుకువచ్చారు అని కేటీఆర్ గుర్తు చేశారు.

ఏసీబీ, ఈడీ చేసిన విచారణలో ఎలాంటి అవినీతి లేదన్న విషయాన్ని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. . గ్రీన్ కో కంపెనీకి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వలన ఒక రూపాయి అయినా లాభం జరిగిందా..? ఆ కంపెనీకి ఎలాంటి లబ్ధి చేయనప్పుడు క్విడ్ ప్రోకో అని మాట ఎలా వర్తిస్తుందన్నారు. ప్రభుత్వము ఖర్చు చేసిన రూ. 46 కోట్లలో నయ పైసా అయినా మాకు రాలేదన్నారు.

Leave A Reply

Your email address will not be published.