Take a fresh look at your lifestyle.

డా.బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలను చేసిన అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి

  • ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్.

ముద్ర, ధర్మపురి : కొన్ని రోజుల క్రితం పార్లమెంట్లో కేంద్ర మంత్రి గా వ్యవహరిస్తున్న అమీషా రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయనను వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.జై బాపు- జై భీమ్ -జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో భాగంగా శుక్రవారం ధర్మపురి మండలం ధమ్మన్నపేట నుండి రాజారాం వరకు నిర్వహించిన పాదయాత్రలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉంటూ ఈ విధంగా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలను చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నేను ఒక ఎమ్మెల్యేగా, విప్ గా హోదాలో కొనసాగుతున్న అంటే దానికి అంబేద్కర్ పెట్టిన బిక్ష అని, భారత రాజ్యంగాన్నీ రక్షించాలని, అంబేద్కర్ కల్పించిన హక్కులను కాపాడాలనే ఉద్దేశ్యంతో జై బాపు జై భీమ్ జై సంవిదాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేపట్టడం జరిగిందన్నారు.కాంగ్రెస్ పార్టీలో కుల,మత భేదం లేకుండా ఎలాంటి వర్గాలు లేకుండా పార్టీని ముందుకు నడిపించడం,జాతిపిత మహాత్మాగాంధీ గొప్పతనం, రాజ్యాంగం ఆవశ్యకతలను ప్రజలకు వివరించండమే ముఖ్య లక్ష్యం అని,రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.