Take a fresh look at your lifestyle.

బాధితుల గోస చూడండి-మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

మూసీ విషజలాలకు 40 లక్షల మంది బాధితులే
నల్లగొండ ప్రజల ఆరోగ్యం గురించి మానవత్వంతో ఆలోచించండి
మూసి పునరుజ్జీవనం చేయాలి
ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్న మంచి పనిని ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దు
అభివృద్ది,ప్రజా సంక్షేమమే మా ప్రధాన ఎజెండా
రానున్న రోజుల్లో ఎల్బీనగర్,హయత్ నగర్ ప్రాంతం మరో కోకాపేటా కానుంది

ముద్ర, తెలంగాణ బ్యూరో :
మూసీ విషజలాలతో బాధపడుతున్న 40లక్షల మంది బాధితుల గోస చూడాలని, రాజకీయాల కోసం అడ్డుపడవద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్లగొండ ప్రజల ఆరోగ్యం గురించి మానవత్వంతో ఆలోచించాలని, 30ఏళ్లకే 60ఏళ్ల మనుషుల లాగా మారిపోతున్నారని, కిడ్నీ,క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధులతో సతమతం అవుతున్నారన్నారు. నల్లగొండ అంటేనే ఫ్లోరైడ్ జిల్లా అని, విషపు జలాల జిల్లా అని పేరుందని, ఇక్కడి ప్రజల గోసను మానవత్వంతో అర్థం చేసుకోవాలని కోరుతున్నానన్నారు.
హయత్ నగర్ సాయిబాబా టెంపుల్ (తొర్రూర్ x రోడ్) నుండి 10కోట్ల అంచనా వ్యయంతో 2లేన్ నుండి 4లేన్ రహదారిగా అభివృద్ది చేస్తున్న పనులకు శనివారం మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసి పునరుజ్జీవనం చేయాలని ఆలోచించిన సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం భవిష్యత్ తరాలకు మేలు చేస్తుందని, దాదాపు మూడు గంటల ప్రజెంటేషన్ చూశామని, నల్లగొండ ప్రజల కష్టాలు ఎలా తొలగుతాయి అనేది కళ్లకు కట్టినట్లు చూపించారన్నారు. గంగా నదిని,యమునా నదిని శుభ్రం చేస్తున్నారని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు ఇది గమనించాలన్నారు. మురికికూపంలా ఉన్న మూసిలో మంచి నీటిని పారేలా చేస్తామంటే అడ్డు కోవడం ఎందుకని, 10 వేల మంది ఇళ్లు కోల్పోతున్నారని, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తప్పకుండా చేస్తామన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్న మంచి పనిని ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. అభివృద్ది,ప్రజా సంక్షేమమే తమ ప్రధాన ఎజెండా అని, మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఎవరెన్ని రాజకీయ విమర్శలు చేసినా ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వమే కావాలని కోరుకుంటారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ప్రజల ఆరోగ్యం తమకు ప్రధానమని, దానికి కట్టుబడి ఉన్నామన్నారు.
ఇక, పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా,ప్రజా అవసరాల మేరకు పలు రోడ్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని, విద్యా, ఇతర పనుల నిమిత్తం ఎక్కువ గ్రామీణ ప్రాంతం నుండి వచ్చి స్థిరపడ్డ వారు ఎక్కువ ఉంటారని, ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తామన్నారు. సుమారు 940 కోట్లతో నిర్మిస్తున్న ఈ డబుల్ డెక్కర్ కారిడార్ లో రాష్ట్ర ప్రభుత్వం వాటా 200కోట్లు చెల్లించేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయని, త్వరలో దీనికి సంబంధించిన మీటింగ్స్ ఉన్నాయని, ఈ డబుల్ డెక్కర్ కారిడార్ లో పైన మెట్రో రైలు,నేషనల్ హైవే,కింద స్థానికులు వాహనాలు క్రాస్ చేసేందుకు యాక్సిడెంట్స్ కు ఆస్కారం లేకుండా వెహికిల్ అండర్ పాస్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతం నుండే మూడు హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్లు రాబోతున్నాయని, ప్రత్యామ్నాయ సిటీగా ఫ్యూచర్ సిటీనీ నిర్మిస్తున్నామని, ఇక్కడ నుండే చెన్నై,బెంగళూరు, ముంబై పూణెను కలుపుతూ.. హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్,హైవే కారిడార్లు రాబోతున్నాయన్నారు.

Leave A Reply

Your email address will not be published.