గొల్లపల్లి, ముద్ర: జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండల వ్యాప్తంగా హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఆలయాల్లో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.జయంతి సందర్భంగా ఆలయాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.హనుమాన్ దీక్షాపరులు రామనామ స్మరణతో ఆలయాలు మారుమోగాయి.అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్ర మం నిర్వహించారు.గోవిందుపల్లె గ్రామంలో జయంతి సందర్భంగా ఆలయం కమిటీ నిర్వహించిన్న ఎడ్ల బండ్ల పోటీలను జెండా ఊపి ప్రారంభించగా పోటీలు హోరాహోరీగా సాగాయి.పోటీలో గెలుపొందిన వారికి దాతలు ప్రధమ బహుమతి కేతిరెడ్డి భూమారెడ్డి, ముస్కు రాంరెడ్డి,2.5 గ్రాముల బంగారం, ద్వితీయ బహుమతి గెలుపొందిన వారికి మదాసు మహిపాల్,భాగ్యలక్ష్మి 100 గ్రాముల వెండి, మూడో బహుమతి గెలుపొందిన వారికి ఆర్ఎంపీ డా.రాజేంధర్ 60 గ్రాముల వెండి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, హనుమాన్ దీక్షపరులు, గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.
