Take a fresh look at your lifestyle.

మున్సిపాలిటీలలో కాంట్రాక్టర్లు క్వాలిటీ తో పాటుగా కార్మికుల రక్షణ చర్యలు చేపట్టాలి  – మున్సిపల్ ప్రభుత్వ కాంట్రాక్టర్లకు ఎస్కీ లో రెండు రోజుల శిక్షణ

ముద్ర హైదరాబాద్ :
రాబోయే ఐదారేళ్ళలో  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నగరాభివృద్ధి కింద  వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ లో  వందల కోట్లతో ప్రజల సౌకర్యం కోసం అనేక సివిల్ వర్క్స్  చేసే అవకాశం ఉందని, అమృత్, స్వచ్ఛ భారత్ మిషన్, అర్బన్ ఛాలెంజింగ్ తదితర నిధులతో కూడా అనేక నూతన ప్రాజక్టులు వచ్చే అవకాశం ఉందని, ఈ నిర్మాణాల బాధ్యతలన్నీ కూడా మున్సిపాలిటీ కాంట్రాక్టర్లపై ఉందని,  ఇందుకోసం  ప్రతీ పనిలో క్వాలిటీ స్టాండర్డ్స్ పెంచుకోవడంతో పాటుగా,  పని జరిగే ప్రదేశాల్లో కార్మికుల రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టంభివృద్ధి శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ విశ్వనాధ్ రాజు అన్నారు.
తెలంగాణ అర్బన్ లోకల్ బాడీస్ లో పనిచేస్తున్న ప్రభుత్వ  సివిల్ కాంట్రాక్టర్ల రెండు రోజుల రెండవ బ్యాచ్ శిక్షణా కార్యక్రమం గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో గురువారం 14 మే, 2026 ప్రారంభమయింది.  సిద్ధిపేట, లక్సెట్టిపేట, జగిత్యాల, కోరుట్ల, ములుగు, అశ్వారావు పేట, మంచిర్యాల, మంథని తదితర మున్సిపాలిటీలలో పనిచేస్తున్న సివిల్ కాంట్రాక్టర్లు హాజరైన ఈ సమావేశంలో కాంట్రాక్టర్లు చేబట్టే అనేక సివిల్ వర్క్స్ నిర్మాణాల్లో అనుసరించాల్సిన  విధానాలు, జాగ్రత్తలు, ప్లానింగ్,  ఎగ్జిక్యూషన్, డాక్యుమెంటేషన్ వాటిపై సీనియర్ అధికారులచే శిక్షణ ఇప్పించారు. కాంట్రాక్టర్లకు శిక్షణ ఇవ్వడం తెలంగాణాలో ఇది మొదటిసారని, రాష్ట్రంలోని సుమారు 276 మంది కాంట్రాక్టర్లకు ఏడు విడతల్లో ఈ శిక్షణా కార్యక్రమానులుంటాయని సి.డి.ఎం.ఏ రీజినల్ డైరెక్టర్ ఆర్. శ్రీనివాస రావు అన్నారు
నేటి రోజుల్లో కెపాసిటీ బిల్డింగ్ ప్రతి వృత్తికి  అవసరమైన టూల్  కిట్ అని జాయింట్ డైరెక్టర్ బి. సంధ్య అన్నారు. టెక్నాలజీ అనూహ్యంగా విస్తరిస్తున్న దశలో ఇంజనీరింగ్ పనులు కూడా ఒక సవాలుగా మారాయని, విశ్వంలోని ప్రతిచోటా ఇంజనీరింగ్ అద్భుతాలు కనబడుతున్నాయని, మునిసిపల్ ఏరియాల్లో పనిచేసే కాంట్రాక్టర్లు కూడా వినూత్నమైన ఆలోచనలతో ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడే  అనేక పనులు చేపట్టవచ్చని సంధ్య అన్నారు
ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జి.రామేశ్వర్ రావు మాట్లాడుతూ పబ్లిక్ వర్క్స్ చేస్తున్నపుడు క్వాలిటీతో పాటుగా బెస్ట్ ప్రాక్టీసెస్, మోడరన్ టెక్నాలజీ లను స్టడీ చేసి పనులు చేపట్టాలని కాంట్రాక్టర్లకు సూచించారు
సమావేశంలో రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ జియావుద్దీన్, వెంకట్గేశ్వర్లు, అనితా అగర్వాల్, వి. మోహన్ కుమార్, అనిల్ కుమార్  నాగమల్లేశ్వర రావ్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.  శిక్షణలో భాగంగా దుర్గం చెరువుతో పాటుగా రేపు సిద్ధిపేట  మున్సిపాలిటీలోని అమృత్ పార్క్, సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్, ఎలేవేటేడ్ లెవల్ సర్వీస్ రిజర్వాయర్ జరిగిన పనుల తీరును కాంట్రాక్టర్లు పరిశీలిస్తారు.

Leave A Reply

Your email address will not be published.