- ఆవాస్తవా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు.
- జగిత్యాల డీఎస్పీ రఘు చందర్.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై, వాస్తవాలను తెలుసుకోకుండా పోస్టులను ఫార్వర్డ్ చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జగిత్యాల డిఎస్పీ రఘు చందర్ హెచ్చరించారు.సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజ నిజాలు తెలుసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో అ మేసేజ్ లను ఫార్వర్డ్ చేయవద్దని, సోషల్ మీడియా పై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించెందని తెలిపారు.జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సోషల్ మీడియా విభాగం ప్రతి పోస్టు ను నిశితంగా పరిశీలించడం జరుగుతుందని అన్నారు.కొందరు ఇతర దేశాలలో ఉంటూ సోషల్ మీడియాలో ఏం చేసినా తమకేం కాదన్న ధీమాతో సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు పెడుతున్నారని..అలాంటి వారిపైనా కేసులు నమోదు చేసి లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి పాస్ పోర్టులు, వీసాలను కూడా రద్దు చేయింవచ్చని అన్నారు.ఇప్పటికే ఇలాంటి పోస్టులను వాట్సాప్, ఫేస్బుక్ ల ద్వారా చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టుల పై ఎలాంటి అనుమానలు, సందేహాలు ఉన్న జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సంప్రదించాలని ప్రజా భద్రత,లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ప్రజలు శాంతి యుత జీవనం గడిపేల చూడడం జగిత్యాల జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం అన్నారు.