- ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల మండలంలోని నర్సింగ పూర్, గుట్రాజ్ పల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కోరారు.జగిత్యాల పట్టణ పొన్నాల గార్డెన్స్ లో నూతన అర్ ఓ అర్ చట్టం 2025 భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తో కలిసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు.అనంతరం జగిత్యాల పట్టణం,అర్బన్,రూరల్ మండలాలకు చెందిన లబ్ది దారులకు 93 మందికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 26. 50 లక్షల చెక్కులను,87 మందికి కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా మంజూరైన రూ . 87 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
భూభారతి తో రైతులకు సత్వర న్యాయం జరుగుతుందని అన్నారు.కలెక్టర్ స్థాయిలోనే భూ సమస్యలు పరిష్కరించే అవకాశం ఉందని అన్నారు.గ్రామ స్థాయిలోనే భూభారతి చట్టం అమలు అయ్యేవిదంగా చూడాలని,అమాయక ప్రజల, రైతుల భూములు ఇష్టారీతిన రిజిస్ట్రేషన్ చేసిన అధికారులను శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు.
