Take a fresh look at your lifestyle.

రైతులు తమ పంట అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల్లో యుద్ధం చేస్తున్నారు 

  • దేశం కోసం సైనికులు సరిహద్దుల్లో యుద్ధం చేస్తున్నారు.
  • మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అందాల పోటీల్లో బిజీగా ఉన్నారు.
  • ప్రభుత్వ యంత్రాంగమంతా  సుందరిమనుల సేవల్లోనే  పరితపిస్తోంది.
  • రాష్ట్ర ప్రజలను గాలికొదిలిండు.
  • ఇంతకంటే అధ్వానం మరోటి ఉందా?
  • ధ్వజమెత్తిన మాజీ మంత్రి హరీశ్  రావు.
ముద్ర, తెలంగాణ బ్యూరో: దేశం కోసం  సైన్యం సరిహద్దుల్లో యుద్ధం చేస్తోంది.తమ పంట అమ్ముకోవడానికి కొనుగోలు రైతులు కేంద్రాల్లో యుద్ధం చేస్తున్నారు కానీ ఇవేమీ పట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి అందాల పోటీల్లో బిజీ గా ఉన్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు.రాష్ట్ర సీఎం ఇంత నిర్లక్ష్యంగా ఉన్న ఏకైక వ్యక్తి రేవంతే అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఇదేనా ప్రజా పాలన అంటే అని నిలదీశారు.కేవలం అందాల పోటీలు తప్ప మరే పని లేదన్న చందంగా సీఎం, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమంతా ఆ పోటీల్లోనే నిమగ్న కావడం  సిగ్గుచేటని విమర్శించారు.మంగళవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలు పెండింగ్ లో ఉంటే అవేమీ పట్టనట్లుగా సీఎం వ్యవహరించడం తగదన్నారు.సన్న వడ్లకు బోనస్ రూ. 512 కోట్ల అంశం పెండింగ్ లో ఉండగా నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రోజుల తరబడి పెండింగ్ లో ఉందన్నారు.కానీ సీఎం అందాల పోటీల్లో బిజీగా ఉంటూ ఆ పోటీల మీద రివ్యూల మీద రివ్యూలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.వేలాది మంది పోలీస్ లను, ప్రభుత్వాధికారులను నియమించి అందాల పోటీలను నిర్వహిస్తున్నారన్నారు.దేశానికి అన్నం పెట్టే రైతు కోసం, ఆరుగాలం కష్టపడే రైతు కష్టం తీర్చడానికి  సీఎంకు సమయం లేకపోవడం చాలా దురదృష్టకరమన్నారు.ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఏ పాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతున్నదన్నారు.ధాన్యపు రాశులను గాలికి వదిలేసి, అందాల పోటీలతో అందాల రాశుల చుట్టూ ముఖ్యమంత్రి, ప్రభుత్వ యంత్రాంగం తిరుగుతున్నదని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో రైతులను అరిగోస పెడుతోందన్నారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు.ఈ యాసంగికి 70 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొంటామని ప్రభుత్వం చెప్పింది కానీ 40 లక్షల మెట్రిక్ టన్నులు కూడా దాటలేదన్ేనారు..కొన్న వడ్లకు రూ. 4 వేల కోట్లు బకాయి పడిందని విమర్శించారు. 48 గంటల్లో కొన్న ధాన్యానికి రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రగల్బాలు పలికారని మండిపడ్డారు.పంట కొని పది రోజులైనా రైతులకు డబ్బులు ఇవ్వడం లేదన్నారు.లారీలు లేక కొన్న లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులోకి పోకుండా మిగిలిపోయిందన్నారు.పెట్టుబడి సహాయం అందించడంలో తీవ్ర జాప్యం  జరుగుతోందన్నారు.వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిర్రు అని విమర్శించారు.యాసంగి రైతుబంధు మూడెకరాలకు మించి వేయలేదన్నారు.పెట్టుబడి సాయం కోసం 18 వేల కోట్లు బడ్జెట్లో పెట్టామని సంవత్సరమంతా మెల్లగా ఇస్తామని డిప్యూటీ సీఎం అనడం సిగ్గుచేటన్నారు.కోతలు అయిపోయినా యాసంగి పెట్టుబడి సహాయం ఇంకా వెయ్యలేదన్నారు.అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్  రూ.10 వేలు ఇస్తున్నాడు మేం అధికారంలోకి వస్తే రూ. 15వేలు ఇస్తామని కోతలు కోశారని హరీశ్ రావు  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అది కూడా పంట సీజన్ ప్రారంభం కంటే ముందే ఇస్తామన్నారన్నారు.కాంగ్రెస్ నేతలు కోతలు చేతలు శూన్యమన్నారు. చివరకుకొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి తక్షణమే కాంటా వేయడంలో జాప్యం జరుగుతందన్నారు.కొన్న ధాన్యాన్ని తరలించడంలో జాప్యం ధాన్యం అమ్మిన తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడంలో జాప్యం.గన్నీ బ్యాగులను సమకూర్చడంలో వైఫల్యం ధాన్యాన్ని లారీలకు ఎక్కించే హమాలీలను సమకూర్చడంలో వైఫల్యం.కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో వైఫల్యం గొప్పగా చెప్పిన బోనస్ అందజేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందన్నారు.
  • తరుగు తీస్తున్నారు.
గత అసెంబ్లీలో రేవంత్ కాంగ్రెస్  ప్రభుత్వంలో తరుగు తీయ్యము అని అని స్పష్టంగా చెప్పారన్నారు. కానీ ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో జెట్టి రాజు అనే రైతు క్వింటాల్కు 10 కిలోల తరుగు తీస్తున్నారని ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.అందుకే రాష్ట్రం వ్యాప్తంగా  రైతులు ఆందోళన చేస్తున్నారన్నారు.తాలు, తరుగు పేరుతో రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు.ఇది కాకుండా కొనుగోలు కేంద్రాల్లో వేసిన తూకం కంటే మిల్లర్లు తక్కువ ధాన్యాన్ని చూపుతూ రైతులకు నష్టం కలిగిస్తున్నారన్నారు.కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలించడానికి 3 నుంచి 4 రోజులు, మిల్లుల దగ్గర అన్ లోడ్ చేయడానికి మరిన్ని రోజులు ఆలస్యం అవుతోందన్నారు.దీంతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతోందన్నారు.ఆన్‌లైన్ ట్రాక్‌ షీట్‌ విధానం అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పినా ఇప్పటివరకు అమలు చేయలేదని మండిపడ్డారు.దీంతో పండిన పంటను అమ్ముకోవడానికి రైతులు 10 రోజులకు పైగా కొనుగోలు కేంద్రాల్లో వేచి చూడవలసిన దుస్థితి ఏర్పడిందన్నారు.ఈ ప్రభుత్వం మాటలు ఘనం చేతలు శూన్యమని వివర్శించారు.కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేకపోవడం వల్ల రోజుల తరబడి ఎండలో వేచి చూడడం వల్ల రైతులు పిట్టల్లా రాలిపోతున్నారని పేర్కొన్నారు. తరుగు, తాలు పేరు మీద ఐదు నుండి పది కిలోలు తరుగు తీయడం మానుకోవాలన్నారు.లేని పక్షంలోరైతుల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ త్వరలోనే ఆందోళన చేపడతామని ఇందుకోసం త్వరలోనే తగు కార్యాచరణ ప్రకటిస్తుందన్నారు.
  • కేసీఆర్ మాటే..తనకు శిరోధార్యం.
కొన్ని వందలసార్లు చెప్పాను కేసీఆర్  బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను నేను అని హరీశ్ రావు స్పష్టం చేశారు.మీడియా ప్రతినిధి ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన సమాధానమిస్తూ పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని శిరసావహిస్తానని అన్నారు.అంతే తప్ప పార్టీ నిర్ణయాన్ని జవదాటను అని చెప్పారు.మై లీడర్ ఇస్ కేసీఆర్.వాట్ ఎవర్ కేసీఆర్ సే హరీష్ రావు విల్ ఫాలో అని పేర్కొన్నారు.తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఈ సందర్భందా ఖండించారు.తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాట్లాడుతూ తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే స్వాగతిస్తానని అన్నారు.కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.