Take a fresh look at your lifestyle.

న్యాయవాద ఎన్నికలో శ్రీనివాస్ రెడ్డి విజయం

చేవెళ్ల బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా శ్రీనివాస్ రెడ్డి విజయం

— ప్రధాన కార్యదర్శిగా చేగురి మహేష్ గౌడ్ విజయం

ముద్ర చేవెళ్ల మార్చి 27:-

చేవెళ్ల బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం చేవెళ్ల కోర్టులో చేవెళ్ల బార్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. హోరా హోరీగా జరిగిన ఎన్నికల్లో అధ్యక్షునిగా శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు.అధ్యక్ష పదవి కోసం పాటి మధుసూదన్ రెడ్డి మరియు శ్రీనివాస్ రెడ్డి పోటీపడగా శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు.ప్రధాన కార్యదర్శి పదవి కోసం చేగురి మహేష్ గౌడ్ మరియు బురాన్ సత్యానందం పోటీపడగా బురాన్ సత్యానందం పై చేగురి మహేష్ గౌడ్ విజయం సాధించారు.విజయం సాధించిన అసోసియేషన్ సభ్యులకు తోటి న్యాయవదులు శాలువలతో సన్మానం చేసి మిఠాయిలు తినిపించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.