Take a fresh look at your lifestyle.

పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ తహశీల్దార్ కార్యాలయం ముందు పెన్షనర్ల నిరసన ధర్నా పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి పెన్షనర్ల సంఘం తుంగతుర్తి మండల అధ్యక్షులు పాలవరపు సంతోష్

 

ముద్ర ….తుంగతుర్తి….
పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించే పెన్షన్ వ్యాలిడిషన్ చట్టం-2025ను కేంద్రం తక్షణమే రద్దు చేయాలంటూ బుధవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు పెన్షనర్లు నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు సంతోష్ మాట్లాడుతూ ఈ పెన్షన్ విధానంతో తీవ్ర నష్టం కలుగుతుందని అన్నారు. జనవరి ఒకటి 2026 కంటే ముందు ఉద్యోగ విరమణ పొందిన వారిని, ఆ తర్వాత విరమణ పొందిన పెన్షనర్లను వేర్వేరుగా విభజించి వేతన సవరణ సంఘం సిఫారసుల ప్రయోజనాలు ఉంటాయని చెప్పడం అనుమానాలకు దారితీస్తుందన్నారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. పెండింగ్ డిఏల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. ధర్నాకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సీతయ్య, రమేష్ గౌడ్ సంఘీభావం తెలిపారు. అనంతరం తహశీల్దార్ దయానందంకు వినతిపత్రం అందించారు.

Leave A Reply

Your email address will not be published.