మొయినాబాద్, ముద్ర విలేకరి: భారతీయ జనతా పార్టీ మొయినాబాద్ రూరల్ అధ్యక్షునిగా దారెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని నియమితులయ్యారు. మండలంలోని కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.చురుగ్గా పార్టీ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించిన అధిష్టానం మొహీనాబాద్ రూరల్ అధ్యక్షునిగా నియమించింది.తన పైన నమ్మకంతో పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు అప్పజెప్పినందుకు కృతజ్ఞశయంతో పని చేస్తానని ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.