Take a fresh look at your lifestyle.

అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి

  • జీహెచ్ ఎమ్సీ కమిషనర్ ను కోరిన పీయేసీ ఛైర్మన్ గాంధీ.

మాదాపూర్, ముద్ర విలేఖరి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సకాలంలో నిధులు మంజూరీ చేసి, పనులు పూర్యయ్యేలా చర్యలు తీసుకోవాలని పీయేసీ ఛైర్మన్, ఎమ్మేల్యే అరికపూడి గాంధీ జీహెచ్ఎమ్సీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ను కోరారు.జీహెచ్ఎమ్సీ ప్రధాన కార్యక్రమంలో సోమవారం కమిషనర్ కర్ణన్ ను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి తో మర్యాదపూర్వకంగా కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై ఆరెకపూడి గాంధీ చర్చించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల, పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అధిక మొత్తంలో నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని, పనులలో వేగం పెంచాలని కోరారు. అభివృద్ధి పనులకు సకాలంలో నిధులు మంజూరు అయ్యేలా చూడాలని, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నానని, అందుకు మీ సహకారం అవసరమని కోరారు.రాబోయే వర్షాకాలం లోపు పెండింగ్ పనులు పూర్తి చేయాలని, రోడ్ల పునరుద్ధరణ పనులకు నిధులు మంజూరు చేసి త్వరితగతిన పనులు పూర్తి అయ్యేలా చూడాలని, మట్టి రోడ్ల ఉన్న ప్రాంతాలలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, అభివృద్ధి పనులలో వేగం పెంచేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు.అదేవిధంగా చెరువుల సుందరికరణ, పార్క్ లు అభివృద్ధి చేపట్టాలని, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజి పడకూడదు అని, అధికారులతో చర్చించి తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కానీలలో మౌలిక వసతులు ఏర్పాటు కు కృషి చేయాలని, కాలనీలలో విధి దీపాల నిర్వహణ సరిగ్గా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు అని, తక్షణమే విధి దీపాలు ఏర్పాటు కు నిధులు మంజూరు చేయాలని, అవసరమైన విధి దీపాలను ఏర్పాటు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని కమిషనర్ కు సూచించారు.కమిషనర్ కర్ణన్ సానుకూలంగా స్పందిస్తూ మౌలిక వసతుల కల్పనలో భాగంగా రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తాయడంతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.