Take a fresh look at your lifestyle.

దేశంలో అక్రమంగా నివసిస్తున్న పాక్, బంగ్లా దేశీయులను వెనక్కి పంపాలి

  • బిజెపి జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ పౌరులని గుర్తించి వెంటనే వెనక్కి పంపాలని జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు మాట్లాడుతూ ఒకప్పుడు జగిత్యాల దేశభక్తుల అడ్డగా ఉండేదని అలాంటిది ప్రస్తుతం దేశద్రోహుల అడ్డాగా మారిందని అన్నారు. జగిత్యాల జిల్లాలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ పౌరులను గుర్తించి వారిని వెంటనే బయట పంపాలని కోరారు.పాకిస్తాన్ మద్దతుదారులైన తీవ్రవాదులు కాశ్మీర్ లోని పహెల్గాం లో అమాయకులైన భారతీయులను అత్యంత కిరాతకంగా చంపివేయడం ప్రతి భారతీయుని మనసులను కలచివేసిందన్నారు. వీసా గడువు దాటిపోయిన, అక్రమంగా వలస వచ్చిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ పౌరులను గుర్తించి వెంటనే వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిజేపీ పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్, నాయకులు పిల్లి శ్రీనివాస్, ఆముద రాజు, మరిపెల్లి సత్యం, దశరథ రెడ్డి, రుద్ర శ్రీనివాస్, జున్ను రాజేందర్, నలువాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.