- జిల్లా ఎస్పీ రావుల గిరిధర్.
ముద్ర ప్రతినిధి, వనపర్తి : వివాదాలు అనేవి పెంచుకోవాలనుకుంటే జీవితకాలం కొనసాగుతాయని, ఒకవేళ ఇంతటితో కలిసుంటామని ఒక నిర్ణయానికి వస్తే అప్పుడే సమసిపోతాయని, జిల్లాలో వివిధ రకాల రాజీపడదగు కేసులు కక్షిదారులకు రాజీమార్గమే రాజమార్గమని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు.ఈ సందర్బంగా ఎస్పీగారు మాట్లాడుతూ.. ఉచిత న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జూన్ 14.06.2025 న వనపర్తి జిల్లా కోర్టులలో “నేషనల్ లోక్ అదాలత్” సందర్భంగా కక్షిదారులకు పోలీసులు అందుబాటులో ఉంటారని తెలిపారు. మీకు తెలిసిన వాళ్లపై ఏమైనా కేసులు ఉంటే వాటిని రాజీ చేసుకొని కోర్టుకు హాజరైనట్లయితే ఆ కేసులను పూర్తిగా క్లోజ్ చేయడం జరుగుతుందని అన్నారు.యాక్సిడెంట్ కేసులు, కొట్టుకున్న కేసులు, చీటింగ్ కేసులు, వివాహబంధానికి సంబంధించిన కేసులు, చిన్న చిన్న దొంగతనం కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మరియు ఇతర రాజీ పడదగు కేసులలో ఈ నేషనల్ లోక్ అదాలత్ లో రాజీ చేసుకుని క్లోజ్ చేసుకోవచ్చని ఎస్పీ అన్నారు. ఈ అవకాశాన్ని కేసులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరని కోరారు. దీనికోసం ఫిర్యాదు దారుడు మరియు నేరస్తులు అందరూ తమ యొక్క ఆధార్ కార్డు తీసుకుని సంబంధిత కోర్ట్ ప్రదేశంలో హాజరుకావాలని తెలిపారు.జాతీయ లోక్ అదాలత్ లో జిల్లావ్యాప్తంగా బాధితులకు మంచి అవకాశమని, సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ గారు తెలిపారు.