- జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్.
ముద్ర, ప్రతినిధి,జగిత్యాల: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరగానే జగిత్యాల పట్టణ అభివృద్ధికి రూ. 70 కోట్ల నిధులు మంజూరు చేశారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని 9వ వార్డు లో రూ.11 లక్షలతో సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల పట్టణానికి రూ.50 కోట్లు, విలీన ప్రాంతాలకు రూ.20, రాయికల్ కు 15 కోట్లు మంజూరు చేశారని, ఇందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రూ.50కోట్ల పనులు ఏ ఏ పనులు కు కేటాయించాలి జీవో లో స్పష్టం చేశారని, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు ఉపయోగించుకోవాలని జీవో లో పేర్కొనడం జరిగిందన్నారు. యావర్ రోడ్డు విస్తరణ కు కోరగానే నిధులు మంజూరు చేస్తానని ముఖ్యమంత్రి గతంలోనే ఆమె ఇచ్చారన్నారు. ప్రశ్నించడం కాదు, పని చేయటం ముఖ్యమన్నారు. జగిత్యాల పట్టణం లో నాణ్యతతో కూడిన పనులు జరుగుతున్నాయని, 20 ఏండ్ల నుండి నిరుపయోగంగా ఉన్న ధరూర్ క్యాంప్ వాటర్ ట్యాంక్ ను ఉపయోగం లోకి తీసుకువచ్చామని, రూ.36 కోట్ల తో అమృత్ కార్యక్రమం లో భాగంగా తాగు నీటి పనులు జరుగుతున్నని అన్నారు. హనుమాన్ వాడ, పోచమ్మ వాడ, శంకులపల్లి లో నీటి కొరత నివారణకు నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపడతామన్నారు. ప్రజల సహకారం తో పట్టణం అభివృద్ధి సాధ్యమని, జగిత్యాల అభివృద్ధి కి అధికారుల బాధ్యత కూడా ఉండాలని, లే అవుట్ లు లేకుండా ఇంటి నిర్మాణాలు చేపట్టరాదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్ లు అడువాల జ్యోతి లక్ష్మణ్, గిరి నాగభూషణం, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ శ్రీలత రామ్మోహన్ రావు, DE నాగేశ్వర్, సాగర్ రావు, సత్యం రావు, రఘుపతి బ్రహ్మాండభేరినరేష్, బాలే శంకర్, మున్సిపల్ సిబ్బంది, మాజీ కౌన్సిలర్ లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.