Take a fresh look at your lifestyle.

నాగుల పంచమి ప్రత్యేక పూజలు

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి:నాగుల పంచమి సందర్భంగా పట్టణంలోని పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. మంగళవారం స్థానిక విజయ గణపతి దేవాలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో జంట నాగుల విగ్రహాలకు పాలతో అభిషేకాలు చేశారు. అనంతరం గణపతి,ఆంజనేయస్వామి, సంతోషిమాత,అయ్యప్ప స్వామి ఆలయాలను దర్శించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.