- జి ఎల్ బి కే ఎస్( ఐ ఎఫ్ టి యు) రాష్ట్ర అధ్యక్షులు కె.విశ్వనాథ్.
ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: గోదావరిఖ తిలక్ నగర్ లోని ఐఎఫ్టియు ఆఫీసులో మంగళవారం గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం ఐఎఫ్టియు ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం జరిగింది.ఈ సమావేశంలో కె.విశ్వనాథ్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ 2024-2025 వార్షిక లాభాలు గడించి దాదాపు 4 నెలలు గడుస్తుందని యజమాన్యం లాభాలను ప్రకటించటంలో అలసత్వం ఆలస్యం ను తీవ్రంగా ఖండిస్తున్నా మన్నారు.గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు సింగరేణి యాజమాన్యం పై ఒత్తిడి తీసుకొచ్చి లాభాలను వెంటనే ప్రకటించేటట్లు చేయాలన్నారు.అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని కార్మిక లాభాలను ప్రకటించి కార్మికుల వాటా 40 శాతం చెల్లించాలన్నారు.సింగరేణి కంపెనీ లాభాలను ప్రకటించక పోవడంపై కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనీ సింగరేణి లోని అన్ని కార్మిక సంఘాలు సింగరేణి యాజమాన్యం పై ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చి లాభాలను ప్రకటించే విధంగా కృషి చేయాలని సింగరేణిలో పనిచేస్తున్న అన్ని కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో డివిజన్ అధ్యక్షులు ఎండి కాసిం, ముత్తన్న, ఎల్లయ్య, జి.రాజలింగం, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.