- ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ.
ముద్ర ప్రతినిధి మహబూబ్నగర్: ముచ్చర్ల శ్రీకాంత్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. యాదాద్రి ఇన్ఫ్రా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముచ్చర్ల శ్రీకాంత్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని జడ్చర్ల పట్టణంలో యాదాద్రి ఇన్ఫ్రా ప్రెసిడెంట్ ఎడ్ల బాబయ్య ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం ముచ్చర్ల శ్రీకాంత్ యాదవ్ జన్మదినం సందర్భంగా జడ్చర్ల 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ బాబాయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో అత్యాధునిక సదుపాయాలతో అన్ని రకాల డెవలప్మెంట్ లు చేసి ప్రజల మరియు వ్యాపారుల మన్ననలను పొంది రాష్ట్రంలోని టాప్ 10 కంపెనీలలో ఒకటిగా నిలిచిన కంపెనీగా పేరు తెచ్చుకుంది అని అన్నారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది కస్టమర్ల హృదయాలను దోచుకుని దూసుకుపోతున్న కంపెనీగా పేరుగాంచిన కంపెనీ యాదాద్రి ఇన్ఫ్రా అని ఈ సందర్భంగా ప్రెసిడెంట్ బాబయ్య అన్నారు. ముచ్చర్ల శ్రీకాంత్ యాదవ్ అనే వ్యక్తి చిన్న వయసులోనే సేవాభావంతో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి ఉపాధినిస్తూ, సమాజంలో మార్గదర్శిగా నిలుస్తున్నారు. అలాంటి వ్యక్తి మును ముందు మరింత అభివృద్ధి చెంది మరెంతో మందికి దిక్సూచి కావాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ వంశీ, యాదాద్రి ఇన్ఫ్రా కంపెనీ ప్రెసిడెంట్ కవిత, డిప్యూటీ జనరల్ మేనేజర్ సుభాష్ చంద్రబోస్, మార్కెటింగ్ మేనేజర్ లు శ్రీనివాస్, శిల్ప తదితరులు పాల్గొన్నారు.
