ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో శుక్రవారం బీసీ డిక్లరేషన్ పై హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలు పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం బీసీ డిక్లరేషన్‌లో భాగంగా విద్యా, ఉపాధి,రాజకీయ,వ్యాపార రంగాలలో బీసీ వర్గాకి 42% రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రకంగా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన చౌరస్తా లో పాలాభిషేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గట్ల రమేష్ అధ్యక్షతన,ముఖ్యఅతిథిగా కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ హాజరయ్యారు. కార్యక్రమంలో బాణాసంచా పేల్చి, స్వీట్లను పంపిణీ చేస్తూ బీసీ వర్గానికి ఈ నిర్ణయం చైతన్యం తీసుకువస్తుందనే ఆనందాన్ని వ్యక్తపరిచారు.