కోరుట్ల, ముద్ర విలేకరి: కోరుట్ల మండల కేంద్రంలోనీ వినాయక విగ్రహ తయారీ కేంద్రంలో ఇటీవల విద్యుత్ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో గాయపడి, కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోరుట్ల పట్టణానికి చెందిన వెంకటరెడ్డి రాజేష్ ను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం రోజు ఆసుపత్రికి వెళ్ళి స్వయంగా పరామర్శించారు.అతని ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.