ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్, కేంద్రీయ విద్యాలయంకు స్థలం కేటాయించండి… మంత్రి శ్రీధర్ బాబుకు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
జగిత్యాల రూరల్ మండలం చల్గల్ లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్, కేంద్రీయ విద్యాలయంకు స్థలం కేటాయించాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీదర్ బాబును కలిసి జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ శనివారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీదర్ బాబుని వారి కార్యాలయం లో కలిసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం కోసం స్థలం కేటాయించాలని, చాలా రోజుల నుండి స్థలం కేటాయింపు వాయిదా పడడం జరుగుతుందని, స్థలం కేటాయించాలని వినతి పత్రాన్ని అందజేయగా స్పందించిన మంత్రి శ్రీదర్ బాబు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలిపారని వివరించారు. అలాగే సంబంధిత ఉన్నత అధికారులకు త్వరితగతిన స్థలం కేటాయించాలని అధికారులను ఆదేశించడం జరిగింది అని అన్నారు. జగిత్యాల ప్రాంతానికి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్, కేంద్రీయ విద్యాలయం స్థలం కేటాయింపు కొన్ని రోజులుగా వాయిదా పడడం తో నీటి పారుదల శాఖ మంత్రిని గతం లో కలిసి వినతి పత్రాన్ని అందజేయటం జరిగిందన్నారు. అదేవిదంగా స్థలం కేటాయించడానికి జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా పూర్తిగా సహకారం అందిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.